YS Sharmila : విజయవాడ(Vijayawada) గాంధీనగర్ SBI బ్యాంక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు APCC చీఫ్ షర్మిల(YS Sharmila). ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం కోర్టు(Supreme Court) తీర్పును కాంగ్రెస్(Congress) స్వాగతిస్తుందన్నారు. తమ పార్టీ లబ్ధి కోసమే బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. ఏ పార్టీకి.. ఎవరు ఎంత సొమ్ము ఇచ్చారో వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేసింది.
Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!
అక్రమ డబ్బు కోసమే ఈ పథకం అని కామెంట్స్ చేశారు. ఇవ్వాళ SBI ను భలి చేస్తున్నారని ఆరోపించారు. SBI ఒక ప్రజల బ్యాంక్ అని కానీ SBI MODI BANK గా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. SBI ప్రజల సంస్థ కాదు..మోడీ సంస్థ అని పేర్కొన్నారు. వెంటనే బాండ్స్ వివరాలు మొత్తం బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బాండ్స్ బయట పెట్టాలి అంటే 10 నిమిషాల పని అని చెప్పుకొచ్చారు.
Also Read : జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
SBI మోడీ మీద ఇంత భక్తి కరెక్ట్ కాదన్నారు. వెంటనే SBI అన్ని వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బాండ్స్ బయటకు వస్తే బీజేపీ(BJP) ఇరుక్కుంటుందని..బాబు, జగన్ బయట పడతారని అన్నారు. కాంగ్రెసక కు దొంగతనంగా దోచుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. మోడీని కాపాడేందుకు SBI తాత్సారం చేస్తుందని.. SBI చెప్తున్న సమాధానం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. BJPకి ధైర్యం ఉంటే బాండ్స్ బయట పెట్టమని అడగాలని ప్రజలకు నిజాలు తెలియాలని కామెంట్స్ చేశారు.