షర్మిల తెలంగాణ కంటే ఏపీకి ఉపయోగం: వీహెచ్

షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమన్నారు.

New Update
షర్మిల తెలంగాణ కంటే ఏపీకి ఉపయోగం: వీహెచ్

Sharmila is more useful for AP than Telangana

తెలంగాణకు ఉపయోగం లేదు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడాడూ షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి వేవ్ స్టార్ట్ అయింది.. ఎవరి నోట చూసినా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వివరించారు. ముస్లింలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే బీసీ బంధు తీసుకొచ్చారని.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. హెచ్‌సీఏ భూముల లీజు తీసేసి.. రాజీవ్ పేరు తొలగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

రాహులే ప్రధాని..

సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నా. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుంది. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలి. పబ్లిక్ సెక్టర్ అమ్మివేస్తుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు. 2024లో మోడీ పోయి రాహుల్ ప్రధాని కావాలని వీహెచ్ ఆకాంక్షించారు.

నా గోల్ అంతా తెలంగాణలోనే..

ఇదిలా ఉంటే వైఎస్. షర్మిల రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ విలీనమా? పొత్తా? అన్న అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నట్లు చర్చ నడుస్తోంది. ఇటీవల పార్టీ విలీనం అంశాన్ని షర్మిల కొట్టిపారేశారు. అంతేకాకుండా తుది శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని షర్మిల స్పష్టం చేశారు. షర్మిల.. ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

Advertisment
తాజా కథనాలు