ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: షర్మిల ఈ డ్రామాలు ఎందుకు చిన్నదొరా.. ఓట్ల కోసమే కదా అంటూ మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల మండిపడ్డారు. నిన్నటి వరకు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తోందని.. ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పును అంగీకరించినట్లే కదా అని షర్మిల అన్నారు. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ షర్మిల ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 19 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Y. S. Sharmila: ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అంటూ మంత్రి కేటీఆర్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అని అన్నారు. Also read: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్… రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!! ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదు గాని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడంటూ దుయ్యబట్టారు. బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరే అని దూషించారు. ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా! ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజమని మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవమన్నారు. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా?… — YS Sharmila (@realyssharmila) October 19, 2023 ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు అంటూ ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలని.. ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని మంత్రి కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు చేశారు. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు మీరు అంటూ త్రీవ స్ధాయిలో దూషించారు. #sharmila #telanagana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి