Sharmila: మళ్లీ రాజన్న రాజ్యమే.. ఆర్టీవీతో షర్మిల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్ గా మాట్లాడారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆమె సాదారణ ప్రజలతో మమేకం అయితేనే సమస్యలు తెలుస్తాయన్న తండ్రి మాటలను గుర్తు చేసుకున్నారు.

New Update
Sharmila: మళ్లీ రాజన్న రాజ్యమే.. ఆర్టీవీతో షర్మిల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!

 

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

తన తండ్రి ఆశయ సాధన కోసం ఏపీ ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తనతో టచ్ లో వున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలతో కలవకుండా.. మమేకం కాకుండ.. ప్రజల సమస్యలు తెలుసుకోలేమని అన్నారు. ఓట్ల కోసం ప్రజల చూట్టు తిరిగి గెలిచిన ఎమ్మెల్యే , ముఖ్యమంత్రి ప్రజల మధ్య తిరగకుండా ఉంటే వారి సమస్యలు ఎలా తెలుస్తాయి..ఎలా తీరుస్తారంటూ ప్రశ్నించారు. గ్యాస్ ధరలు, కరెంట్ బిల్లు ఇలా అన్ని ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు