Shanthi : శాంతి, మదన్ మోహన్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సుభాష్ ఆడియో వైరల్! శాంతి, మదన్ మోహన్, సుభాష్, విజయసాయిరెడ్డి ఇష్యూలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ మదన్ మోహన్ ఫ్రెండ్‌తో సుభాష్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మరోవైపు శాంతితో సుభాష్ దిగిన ఫొటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shanthi-Subhash : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన శాంతి (Shanthi), మదన్ మోహన్ (Madhan Mohan), సుభాష్, విజయసాయిరెడ్డి ఇష్యూలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ మదన్ మోహన్ ఫ్రెండ్‌తో సుభాష్‌రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ అవుతోంది. శాంతి తన పేరు ఎందుకు చెప్తుందో తెలియదని, తనకు సంబంధం లేదంటూ సుభాష్‌రెడ్డి వాదిస్తున్నాడు. డెలివరీ టైమ్‌లో ఎమర్జెన్సీ ఉంది రమ్మంటే వెళ్లాను. హాస్పిటల్లో సంతకం పెట్టిన పాపానికి ఇరికిస్తున్నారు. మదన్‌మోహన్ నాకు పిచ్చిపిచ్చి మెస్సేజులు చేస్తున్నాడు. నేను దేనికైనా రెడీ అంటూ సుభాష్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. మరోవైపు మాత్రం శాంతితో సుభాష్‌రెడ్డి దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంతి కడుపుతో ఉండగా, బిడ్డ పుట్టిన తర్వాత కూడా సుభాష్ ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ బిడ్డకు దుర్గగుడిలో శాంతి పూజల్లోనూ సుభాష్‌రెడ్డి పాల్గొన్నట్లు రుజువు అవుతోంది. విజయసాయిరెడ్డి వల్లే గర్భం దాల్చింది.. ఇదిలా ఉంటే.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) వల్లే తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ (Hyderabad Press Club) లో మీటింగ్ లో ఆరోపించారు. ఐవీఎఫ్ ద్వారా తాను ఒక బిడ్డను కన్నానని భార్య శాంతినే స్వయంగా చెప్పింది. విజయసాయికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్లను పెంచుకున్నారు. ఆయన పిల్లలు కావాలని నన్ను అడిగారు. విజయసాయిరెడ్డి అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. బాబు కావాలని అడిగారు. అందుకే బేబీని కనిపెట్టాను అని శాంతి చెప్పింది. దాంతో నాకు గుండెలు పగిలిపోయాయి. ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించమని అడిగితే హై ప్రొఫైల్ వ్యక్తులతో ఐవీఎఫ్ చేయించుకున్నా అని చెప్పింది. జనవరి నుంచి శాంతి నన్ను టార్చర్ చేస్తోంది. ఇది ఐవీఎఫ్ కాదు.. ఫిజికల్ రిలేషన్ షిప్ అని నిలదీశా. అవును హై ప్రొఫైల్ వ్యక్తి అని చెప్పింది. శాంతి నా పరువు తీసేసింది. ఐవీఎఫ్‌తో బాబును కన్నానని అంటుంది. డాక్యుమెంట్స్ చూపించదు. తండ్రి ఎవరో తెలియదు. ఎమన్నా అంటే విజయసాయిరెడ్డిని అడుగు అని చెప్పింది. నేను విదేశాల్లో ఉండగా శాంతి నా పరువు మొత్తం తీసేసిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. #madan-mohan #vijayasai-reddy #k-shanthi #subhash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి