AP News : ఓ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌పై భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు శాంతి (Shanthi) ఖండించారు. మదన్ మోహన్ (Madhan Mohan) తో తనకు 2013లో పెళ్లి జరిగిందని, ఆ యేడాదిలోనే గర్భం దాల్చి 2015 ఏప్రిల్ లో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. 2010-15 మధ్య తాను ‘లా’ చదివుతున్నప్పుడు భర్త మదన్ చాలా హింసించాడని, ఈ క్రమంలోనే 2016లో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. 2021 వరకూ విశాఖ (Vizag) లోనే ఉన్నానని, మదన్‌తో విడాకుల తర్వాత సుభాష్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయినా మదన్ తనన్ను హింసించారని, ఇప్పుడు రూ. 30 కోట్లు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎస్టీ కులానికి చెందిన మహిళను కావడంతో ఇలా ఏడిపిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు.
సుభాష్ తో పెళ్లి తర్వాత విశాఖపట్నంలోనే 2021 ఉన్నట్లు చెప్పారు. అక్కడి టార్చర్ భరించలేక 2022 విజయవాడ (Vijayawada) ట్రాన్స్ ఫర్ చేయించుకున్నానని అన్నారు. ఇక రెండోసారి 2022లో ప్రెగ్నెంట్ అయ్యానని అన్నారు. అయితే యూఎస్ నుంచి వచ్చిన మదన్ మోహన్ మానిపాటి నన్ను చాలా టార్చర్ చేశాడు. ఇద్దరం కలిసి విశాఖపట్నం కోర్టులో ఆస్తి, ప్రాపర్టీ, పిల్లల విషయంలో అన్నీ బాండ్లు రాసుకున్నాం. 30 కోట్ల ఆస్తికోసం నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను బెగ్గర్ కాదు. ఎస్టీ అమ్మాయిని కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. వేరే కులం వారిని అనగలరా? నేను ఉద్యోగం చేయకూడదా? మంచిగా బతకకూడదా?అని ప్రశ్నించారు.
ఇక విజయ్ సాయిరెడ్డి (Vijaysai Reddy) ని తాను విశాఖపట్నంలోనే చూశానని చెప్పారు. ఎంపీగారు పరిచయం అయ్యేసరికి ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఫస్ట్ పోస్టింగ్ చాలా ఛాలెంజింగ్ గా చేశాను. ప్రేమ్ సమాజం ఇనిస్టిట్యూట్ లో సాయి ప్రియ రిసోర్ట్స్ ల్యాండ్ ఇష్యూతో విజయ్ సాయిరెడ్డితో పరిచయమైందన్నారు. డిపార్ట్ మెంట్ ఇష్యూనే సార్ తో మాట్లాడాను. కానీ తప్పుగా వ్యవహరించలేదు. 38 ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల ఆయనతో ఎలా అంటగడతారంటూ భావోద్వేగానికి లోనైంది. నాకు ప్రైవసీ లేదా. నా ట్విట్టర్ ఎందుకు తప్పుగా ప్రచారం చేశారు. వందకోట్లు సంపాదించినట్లు రాశారు. 75 కోట్లు ఇవ్వమని మదన్ మోహన్ అడుగుతున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.
Also Read : జువాలసిస్ట్ ఆడమ్‌కు 249 ఏళ్ల జైలు శిక్ష…ఎందుకో తెలుసా?