Shanthi : శాంతి వ్యవహారంలో తాను ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. శాంతిని ఇప్పటికీ ఒక కూతురులాగానే భావిస్తున్నానని, ఆమె కూడా తనను తండ్రిలాగే చూసిందంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ విషయాన్ని పదే పదే ప్రసారం చేస్తూ కొన్ని న్యూస్ ఛానెల్స్ తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు.
ఈ మేరకు విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ ప్రకారం.. 'అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవుళ్లు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను' అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇదిలా ఉంటే.. భార్య, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో తనకు చట్టపరంగా విడాకులు కాలేదని మదన్‌మోహన్ చెప్పారు. గత రెండేళ్లుగా తాను అమెరికాలో ఉండి జనవరిలో ఇక్కడికి వచ్చిన తర్వాత వారి బాగోతం మొత్త బయటపడిందని తెలిపారు. ఇది బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశమని, ఐవీఎఫ్ ద్వారానే బిడ్డను కన్నట్లు శాంతి తనకు చెప్పిందంటూ మరోసారి మీడియా సమావేశంలో వివరించాడు.
Also Read : ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ