Shanmukh Arrest: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ కి బెయిల్! లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ వైరల్!! గంజాయి కేసులో నిన్న అంటే గురువారం అరెస్ట్ అయిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ బెయిల్ పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర లీగల్ టీమ్ షణ్ముఖ్ ను బయటకు తీసుకువచ్చినట్టుఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. By KVD Varma 23 Feb 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shanmukh Arrest: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కు బెయిల్ మంజూరు అయింది. డ్రగ్స్ కేసులో గురువారం షణ్ముఖ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతని తరఫున లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర వకాల్తా పుచ్చుకున్నారు. ఆయన షణ్ముఖ్ ను బెయిల్ పై తీసుకువచ్చినట్టు తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. ఈ పోస్ట్ లో ఆయన షణ్ముఖ్ తో కలిసి ఉన్న ఫోటో కూడా షేర్ చేశారు. ‘ది బాయ్ ఈజ్ అవుట్ దిస్ ఈజ్ అవర్ లీగల్ టీమ్ వర్క్’ అని పేర్కొన్నారు. దీనిని చూస్తుంటే షణ్ముఖ్ కి బెయిల్ వచ్చినట్టే తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కల్యాణ్ దిలీప్ సుంకర చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ఇదే.. అసలేం జరిగిందంటే.. డ్రగ్స్ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్(Shanmukh Arrest) అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు. తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!! యూట్యూబ్లో అవకాశాలు ఇస్తానని చెప్పి.. షణ్ముక్ మోసం చేశాడని పోలీసులకు డాక్టర్ మౌనిక (Dr Monica) ఫిర్యాదు చేసింది. షణ్ముక్ ద్వారానే అతని అన్న సంపత్ (Sampath Vinay) పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముక్ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఓసారి తనకు అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. అయితే, ఈ కేసులో(Shanmukh Arrest) ప్రముఖ లాయర్ దిలీప్ సుంకర గురువారమే ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. షణ్ముక్కు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. షణ్ముక్పై మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధం లేదని అన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. షణ్ముక్, అతని అన్న సంపత్ వినయ్ కేసు..తాను చూస్తున్నట్లు దిలీప్ సుంకర తెలిపారు. షణ్ముక్ తండ్రి తనతోనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. షణ్ముక్తో తనకు నాలుగేళ్ల పరిచయం ఉన్నట్లు దిలీప్ సుంకర వెల్లడించారు. షణ్ముక్ ఉంటున్న ఫ్లాట్ ఓనర్కు తాను..లీగల్ సెల్ అడ్వైసర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్ వీడియోస్ మొత్తం తన దగ్గరున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. #shanmukh-jaswanth-arrest #shanmukh-jaswanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి