/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-10.jpg)
Shankar Dada MBBS Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్, శర్వానంద్, రోహిత్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సినిమాలో చిరంజీవి నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, జయంత్ పరాంజీ దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు. ముఖ్యంగా చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సామెతలు చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పట్లో ఆడియన్స్ థియేటర్స్ లో రిపీట్ మోడ్ లో చూసిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
GET READY FOR MEGA MAGIC!🔥
Megastar @KChiruTweets Garu's iconic film #ShankarDadaMBBS re-releases on Aug 22nd! 🎉 @actorsrikanth @PawanKalyan @iamsonalibendre @ThisIsDSP#PareshRawal #Sharwanand#Vaishanvtej #JayanthCParanjee#AkkineniRaviShankarPrasad pic.twitter.com/CxjWZfMLrb
— Matters Of Movies (@MattersOfMovies) August 15, 2024
Also Read : రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ సినిమాను ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో 4K క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తున్నారు. జీఆర్కే పిక్చర్స్ బ్యానర్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను అత్యధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా ఈ రీ రిలీజ్‌తో థియేటర్లు మ్యూజికల్ కాన్సర్ట్‌లా, కామెడీ కార్నివాల్‌లా మారడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.