Shami gets marriage proposal:షమీ నిన్ను పెళ్ళి చేసుకుంటా..కానీ ఒక్క షరతు అంటూ నటి పాయల్ ఘోష్ ప్రపోజల్

Shami gets marriage proposal:షమీ నిన్ను పెళ్ళి చేసుకుంటా..కానీ ఒక్క షరతు అంటూ నటి పాయల్ ఘోష్ ప్రపోజల్
New Update

బాలీవుడ్ నటి భారత్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రపోజ్ చేసింది. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అంటూ అడిగింది. మహ్మద్ షమీ...భారత ఫాస్ట్ బౌలర్. వరల్డ్‌కప్‌లో అత్యధ్బుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీలో షమీ నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. కానీ 16 వికెట్లు తీసుకున్నాడు. అందులో రెండు సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు అత్యంత తక్కువ పరుగులు కూడా ఇస్తున్నాడు. ఈ ప్రదర్శనకే ఫిదా అయిపోయింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్. షమీ నిన్ను పెళ్ళిచేసుకోవడానికి నేను రెడీ అనేసింది. అయితే దాంతో పాటూ ఒక కండిషన్ కూడా పెట్టింది. నీ ఇంగ్లీషును మెరుగుపర్చుకుంటే వెంటనే పెళ్ళి చేసుకుంటా అంది. దీన్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.  షమీకి  ఇలా ప్రపోజ్ రావడం ఇది రెండవసారి.

Also read:2, 900రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..

పాయల్ పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది. దీనికి నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తు్న్నారు. ప్రేమకు భాషతో సంబంధం ఏంటని ఒక వర్గం అంటుంటే..షమీ ఎలా స్పందిస్తాడో అంటూ మరి కొందరు అంటున్నారు. అయితే షమీ వరల్డ్‌కప్లో బిజీగా ఉన్నాడు. పాయల్ ఘోష్ పోస్ట్ కు రెస్పాండ్ అవ్వలేదు.

పాయల్ ఘోష్ బాలీవుడ్ నటి. ఈమె తెలుగు నినీ అభిమానులకు కూడా సుపరిచితమే. తెలుగు మంచు మనోజ్ సరసన ప్రయాణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. తరువాత కూడా మరికొన్ని మూవీస్ చేసింది. జూ. ఎన్టీయార్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా పాయల్ నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయిన పాయల్ ఘోష్ అక్కడ కొంత కాలం నటించాక రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.

ఇక భారత బౌలర్ షమీకి ఇంతకు ముందే పెళ్ళయింది. 2014లో హసీన్ జహాన్ అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అయితే తీవ్ర మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ కొంత కాలానికే విడిపోయారు. ప్రస్తుతం షమీ సింగిల్ గానే ఉంటున్నాడు.

Also read:అమర్ దీప్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోకి వైఫ్ తేజశ్విని సర్ ప్రైజ్ ఎంట్రీ..!

#actress #payal-ghosh #indian-bowler #mohammad-shami
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి