Team India: వరల్డ్ కప్ ఫైనల్ లో పరాభవం నేపథ్యంలో టీమిండియాకు దేశవ్యాప్తంగా అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా మద్దతు లభిస్తుండగా; ఓ పోస్టు మాత్రం వైరల్ అవుతోంది. మంచి మనసున్న వాళ్లదే అంతిమ విజయం అన్న మాటలు ప్లే అవుతున్న రీల్ అది. అందులో వింతేముందంటారా! ఆ రీల్ షేర్ చేసింది పేస్ బౌలర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్. ఆమె వీడియోలో కనిపిస్తుండగా, ఆ మాటలు బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతున్నాయి.
ఇదికూడా చదవండి: టీమిండియా ఎందుకు ఓడిపోయింది? సౌతాఫ్రికాతో తోడుగా మనమూ ఉన్నామా?
ఈ రీల్ ఎవరిని ఉద్దేశించి చేసిందై ఉండొచ్చో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా, ఆమె టీమిండియాను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందంటూ అంటూ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. షమీపై కోపముంటే ఇలాంటి పోస్టులు పెట్టడమెందుకంటూ మరికొందరు అభ్యంతరం చెప్తున్నారు. షమీపై ఆరోపణలు చేసిన ఆమె ఇటీవల తీవ్రంగా వ్యాఖ్యానించారు. మంచి క్రికెటర్ లా పేరు తెచ్చుకున్నట్టే షమీ మంచి మనిషిగా ఉండుంటే తమ జీవితాలు ఇలా ఉండేవి కావని హసీన్ జహాన్ ఇటీవల పేర్కొన్నారు.