World Cup 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సెమీస్‌లోకి ప్రవేశించిన తొలి టీమ్ మనదే. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా (Team India) గెలుపునకు బ్యాటింగ్ కంటే బౌలింగే కారణం. బ్యాటింగ్ పిచ్‌లపై కూడా భారత్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను అసలు కుదురుకోనివ్వడంలేదు. మిగిలిన జట్ల బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే మన పేసర్లు వికెట్లు తియ్యడమే కాకుండా మంచి ఎకానమితో బౌలింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా (Hasan Raza) చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
బాల్స్ మారుస్తున్నారా?
నిజానికి ఇన్నింగ్స్-ఇన్నింగ్స్‌కు బాల్ మారుస్తారన్న విషయం తెలిసిందే. ఇండియా బౌలింగ్ వేసేటప్పుడు డిఫరెంట్ బాల్స్ ఇస్తున్నారని హసన్ రాజా కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు ఐసీసీ (ICC) లేదా బీసీసీఐ (BCCI) వేర్వేరు బంతులు ఇస్తోందని ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. దీని కారణంగానే భారత పేసర్లు వికెట్లు తీస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాల్ నార్మల్‌గా బిహేవ్ చేస్తుందని.. అదే ఇండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో మాత్రం బాల్ అనూహ్యంగా స్వింగ్ అవుతుందని ఆరోపించాడు హసన్.
అంపైర్లు హెల్ప్ చేస్తున్నారా?
డీఆర్‌ఎస్ విషయంలోనూ భారత్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని హసన్ చెబుతున్నాడు. బీసీసీఐ హెల్ప్ చేస్తుందా లేదా అంపైర్లు సాయం చేస్తున్నారా అన్న విషయం తనకు తెలియదని.. అయితే ప్రోబ్ మాత్రం జరగాలని అంటున్నాడు. అయితే హసన్ కామెంట్స్‌కు బెస్‌లెస్‌గా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణిస్తుండకపోవడంతో హసన్ తట్టుకోలేకపోతున్నారని భారత్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇండియా గొప్పగా బౌలింగ్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇండియాపై పాకిస్థాన్ కుళ్లు రోజురోజుకు పెరిగిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రపంచకప్‌లో భారత్ పేసర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లెంగ్త్‌లో బౌలింగ్ వేయడంతో పాటు ఫ్లాట్‌ట్రాక్‌లపై కూడా సరైన విధంగా బౌన్స్ రాబడుతున్నారు. ఇదంతా ఎంతోకాలంగా చేస్తున్న కఠోర శ్రమకు దక్కిన ఫలితమనే చెప్పాలి. వరల్డ్‌కప్‌కు (World Cup) పక్కాగా ప్రిపేర్ అయిన భారత్ పేసర్లు తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తుండడంతో పాకిస్థాన్ తట్టుకోలేక విష ప్రచారం చేస్తోందని పలువురు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అటు హసన్ రజా స్పాట్ ఫిక్సింగ్‌లో చిక్కుకున్న ప్లేయర్.
Also Read: World Cup 2023: మా మొదటి లక్ష్యం పూర్తయింది-రోహిత్ - Rtvlive.com