వీల్‌చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్‌ని తిట్టిపోస్తున్న బీజేపీ!

90 ఏళ్ల వయసులో.. అది కూడా ఆరోగ్యం బాగోలేనప్పుడు మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ వయసులో ఒక్క ఓటు కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్‌సింగ్‌ని సభకు రప్పించారని..ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి మన్మోహన్ సింగ్ వచ్చారని.. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని కమల పార్టీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.

వీల్‌చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్‌ని తిట్టిపోస్తున్న బీజేపీ!
New Update

అది రాజ్యసభ..అర్థరాత్రి కావొస్తోంది.. ఢిల్లీ సర్వీస్‌ బిల్లుపై రచ్చ రచ్చ జరుగుతున్న సమయం. విపక్షల మాటలకు కౌంటర్లుగా హోం మంత్రి అమిత్‌షా(amit shah) అప్పటివరకు ప్రసంగించారు.. విమర్శలకు సమాధానమిస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. సర్వీసు బిల్లు(delhi service bill)కు మద్దతుగా ఎన్డీయే పార్టీలు.. వ్యతిరేకంగా INDIA కూటమి పార్టీలు ఓటింగ్‌కి సిద్ధమయ్యాయి. ఇంతలోనే ఓ 90ఏళ్ల పెద్దాయన.. వీల్‌చైర్‌లో సభలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన అంకితభవానికి సభలో ఉన్నవాళ్లంతా, పార్టీలకతీతంగా ఫిదా అయ్యారు. దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన.. 2008 ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడారు. 1991లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాన్ని తన సంస్కరణలతో ముందుకు తీసుకెళ్లారు. దేశానికి ఇన్ని చేసిన మన్మోహన్‌ సింగ్‌(manmohan singh) 90ఏళ్ల వయసులోనూ తన బాధ్యతను మరిచిపోలేదు. ఆరోగ్యం బాగాలేకున్నా.. ఢిల్లీ సర్వీసు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సభకు రావడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అందుకే బీజేపీ కూడా ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ని మెచ్చుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టేలా కూడా బీజేపీ మాటలదాడి చేసింది.



బీజేపీ అటాక్:

90 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

కాంగ్రెస్‌ ఒక్క ఓటు కక్కుర్తి కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్‌ సింగ్‌ని సభకు వచ్చేలా చేసిందని బీజేపీ మండిపడుతోంది. ఓవైపు మన్మోహన్‌ సింగ్‌ అంకితభావాన్ని కొనియాడుతూనే మరోవైపు కాంగ్రెస్‌ని ఏకిపడేసింది. కాంగ్రెస్‌ పిచ్చిని దేశం గుర్తుంచుకుంటుందంటూ ఫైర్ అయ్యింది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితిలో కూడా ఒక మాజీ ప్రధానిని పార్లమెంటులో అర్థరాత్రి వీల్‌చైర్‌పై కాంగ్రెస్‌ కూర్చోబెట్టిందంటూ విరుచుకుపడింది బీజేపీ. అది కూడా ఒక నిజాయితీ లేని కూటమిని బతికించుకోవడం కోసం రెస్ట్ తీసుకోవాల్సిన మన్మోహన్‌ సింగ్‌ని సభకు రప్పించారని..ఇది చాలా సిగ్గుచేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కాంగ్రెస్‌ ఏం చెబుతోంది?

బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌, ఆప్‌, INDIA కూటమి మిత్రపక్ష నేతలు తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసానికి మన్మోహన్‌ సింగ్‌ నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధతకు ఇది సాక్ష్యమన్నారు. అటు సోషల్‌మీడియాలోనూ నెటిజన్ల నుంచి మన్మోహన్‌ సింగ్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఈ వయసులో ఓటు వేయడానికి ఆరోగ్యం బాగోకున్నా వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొంతమంది ఎంపీలకు కనీసం పార్లమెంట్‌కి రావాలన్న బుద్ధి కూడా ఉండదని.. వారంతా మన్మోహన్‌సింగ్‌ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది.

#manmohan-singh #delhi-services-bill
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe