Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు ఏమైంది..మహారాష్ట్ర సర్కార్ హై అలర్ట్..!!

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. 'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

New Update
Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు ఏమైంది..మహారాష్ట్ర సర్కార్ హై అలర్ట్..!!

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. 'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

publive-image

అసలు విషయం ఏంటంటే.. ‘పఠాన్’ సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు రావడంతో ఆయనకు మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు Y ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. Y ప్లస్ సెక్యూరిటీ కింద షారుక్ కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందినవారు. షారుక్ నివాసం చుట్టూ 24 గంటలూ పోలీసులు పహారాలో ఉంటారు.అయితే, షారుక్ కు ఎలాంటి బెదిరింపులు వచ్చేయనే విషయాన్ని మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం లేదు.

publive-image

షారుక్ ఖాన్ హీరోగా ఇటీవల పఠాన్ సినిమా విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. పఠాన్ సినిమా జనవరి 25, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1,050 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత తీసిన  రెండో సినిమా జవాన్ కూడా పఠాన్ రికార్డును బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 7న బిగ్ స్క్రీన్ పైన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు 1,100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది.

Also Read: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..!! బాలకృష్ణ హాట్ కామెంట్స్‌..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు