Telangana: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి

విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ నుంచి ఓ యువతి కిందపడిపోయింది. మద్యం మత్తులో ఉన్న బిశ్వాస్ అనే వ్యక్తి ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రైలు నుంచి పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి.

New Update
Telangana: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి

Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న బిశ్వాస్ అనే యువకుడు..బాత్రూంకు వెళ్ళి వస్తున్న ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్‌-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్‌ దగ్గర ఉన్న బిశ్వాస్‌ ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ఆమె రైలు నుంచి కిందపడిపోయింది. రైలు కొంచెం దూరం వెళ్ళక బిశ్వాస్ కూడా కింద పడిపోయాడు.

కింద పడి గాయాలు పాలైన యువతి కాసేపటికి లేచి దగ్గరలో ఉన్న వారికి తనకు జరిగిన దాని గరించి చెప్పింది. వారి సహాయంతో రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేసింది. వెంటనే రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మరి కొంత దూరంలో పడి ఉన్న బిశ్వాస్‌ను కూడా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే అతడి మీద కేసు మాత్రం నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పవన్ తెలిపారు.

Also Read:Gujarath: గుజరాత్‌లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు