America : బాలికలపై అత్యాచారం(Rape) చేసేందుకు ప్రయత్నించిన ఓ దుర్మార్గుడికి ఊహించని షాక్ తగిలింది. అమెరికాలోని సియాటెల్‌లో 67 ఏళ్ల వ్యక్తి ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడదామని స్థానిక హోటల్‌లోకి దిగాడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న సియాటెల్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు.
పోలీసులపై దాడికి యత్నం..
ఇందులో భాగంగానే ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. సదరు వ్యక్తిని రూం డోర్ తెరవాలని కోరారు. వెంటనే తలుపు తీసిన వ్యక్తి పోలీసులపై తుపాకితో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులు ఆత్మరక్షణ(Self Defense) కోసం అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరిది 7, మరొకరిది 11 ఏళ్ల వయసు ఉంటుందని పోలిసులు గుర్తించారు. ఈ సంఘటన పూర్తిగా సిసీ కెమెరాలో రికార్ట్ అవగా.. సోషల్ మీడియా(Social Media) లో వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
67 శాతం పెరిగిన నేరాల సంఖ్య..
దీనిపై సియాటెల్ చీఫ్ అడ్రియన్ డియాజ్ స్పందించారు. చిన్నారులపై జరిగే ఇంటర్‌నెట్ నేరాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2022 నుంచి 2023 వరకు నేరాల సంఖ్య 67 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇలాంటి కేసులను ఛేదించే క్రమంలో పోలీసుల ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు.