Deepavali: దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కళ్లద్దాలు ధరించడం చాలా బెటర్‌. దీని వల్ల కళ్లకు సేఫ్టీ ఉంటుంది. పెద్దవాళ్లే కాదు..పిల్లలకు కూడా కళ్లజోళ్లు పెట్టాలి.

New Update
Deepavali: దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

దీపావళి పండుగ ఎన్ని ఆనందాలను తీసుకుని వస్తుందో అజాగ్రత్తగా ఉంటే అన్నే విషాదాలను కూడా నింపుతుంది. దీపావళి అంటే మనతో పాటు మన చుట్టుపక్కల వారు కూడా కాల్చుతుంటారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి పక్కవారికి ఇబ్బంది కలుగుతున్న పట్టించుకోరు.

మరికొందరు అందరికంటే మేమే ఎక్కువ కాల్చమూ అనిపించుకోవడానికి పటాకుల మోత మోగిస్తారు. అలా కాల్చుతున్న సమయంలో కొన్ని పటాకులు మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు మన కళ్లకు హాని జరిగే ప్రమాదం ఉంది. కేవలం నిప్పు రవ్వలు మాత్రమే కాదు. బాణసంచా నుంచి వచ్చే పొగ కూడా కంటికి మంచిది కాదు.

దీపావళి తరువాత రోజు అనేక మంది కంటి సమ్యలతో ఆసుపత్రులకు క్యూలు కట్టిన సంఘటనలు అనేకం. అందుకే పండుగ సమయంలో కళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కళ్లద్దాలు ధరించడం చాలా బెటర్‌. దీని వల్ల కళ్లకు సేఫ్టీ ఉంటుంది.

పెద్దవాళ్లే కాదు..పిల్లలకు కూడా కళ్లజోళ్లు పెట్టాలి. దీని వల్ల ఏదైనా నిప్పురవ్వలు, పొగలు వచ్చిన కంటి వరకు చేరకుండా ఉంటాయి. దీని ద్వారా చూపు దెబ్బతినకుండా ఉంటుంది. చిచ్చుబుడ్లు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..అవి కాల్చే సమయంలో భారీగా నిప్పురవ్వలు ఎగిసి పడుతుంటాయి. పొరపాటున కూడా అవి కాల్చేటప్పుడు వాటి చుట్టుపక్కల ఉండకపోవడమే మేలు.

ఇక దుస్తుల విషయానికి వస్తే దీపాల పండుగ అంటే అందరికీ తెలిసిందే. అందుకే పండుగ సాయంత్రం టపాసులు కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు వేసుకోకూడదు. నేడు మార్కెట్లోకి రకరకాల దీపాలు వచ్చేశాయి. కొన్ని దీపాలు చిన్నగా ఉంటే కొన్ని మాత్రం చాలా పెద్దగా ఉంటాయి.

పెద్దగా ఉండే వాటితో కొంచెం ప్రమాదం పొంచి ఉంది. దీపాలు వెలిగించేటప్పుడు ముఖాన్ని దూరంగా ఉంచుకోవాలి. లేదంటే ఒక్కసారిగా పెద్ద మంట వచ్చి కళ్లకు హాని జరుగుతుంది. అదే పనిగా దీపాల వెలుగుల్ని, టపాకాయల వెలుగుల్ని చూడకూడదు. అలా చూడటం వల్ల కూడా కళ్లకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. కంటిలో తేమ తగ్గకుండా చూసుకోవాలి.

కొందరు కావాలనే క్రాకర్స్‌ ను కాల్చుతుంటారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉంచుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య వస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది. కళ్లకు ఏ హాని జరిగినా, ముందుగా నీళ్లతో మెల్లగా కడగండి. కళ్లకు వేడి లేకుండా చల్లబడేలా చెయ్యండి. దాదాపు 15 నిమిషాలపాటూ.. నీళ్లతో చల్లబరచాలి. కళ్లను రుద్దవద్దు. పిల్లలకు ఈ జాగ్రత్తలు తప్పక చెప్పండి.

Also read: దీపావళి రోజు ఆ దిక్కున దీపం పెడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!

Advertisment
తాజా కథనాలు