Serena Williams : సెరెనా విలియమ్స్‌కు ఘోర అవమానం.. పిల్లలతో సహా బయటకు గెంటేసి!

పారిస్‌లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైందంటూ టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ నెట్టింట పోస్ట్ పెట్టింది. పెనిన్‌సులా రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్ తన ఫ్యామిలీని లోపలికి అనుమతించలేదని అసహనం వ్యక్తం చేసింది. టేబుళ్లు ఖాళీలేకపోవడంతో అలా చేయాల్సివచ్చిందని హోటల్ యజమాన్యం క్షమాపణలు తెలిపింది.

New Update
Serena Williams : సెరెనా విలియమ్స్‌కు ఘోర అవమానం.. పిల్లలతో సహా బయటకు గెంటేసి!

Paris Olympics 2024 : అమెరికా (America) టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ (Serena Williams) పారిస్ లో ఊహించని ఛేదు అనుభవం ఎదురైంది. ఒలింపిక్స్‌ వేడుకల కోసం అక్కడికి వెళ్లిన సెరెనా ఫ్యామిలీతో ఓ రెస్టారెంట్ సిబ్బంది దరుసుగా ప్రవర్తించారు. అంతేకాదు సెరెనాను లోపలికి అనమతించకుండా అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా సెరెనా వెల్లడిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

భోజనం చేసేందుకు ఫ్యామిలీతో కలిసి..
ఈ మేరకు 'పారిస్‌లోని పెనిన్‌సులా రూఫ్‌ టాప్‌ రెస్టరెంట్ లో బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. భోజనం చేసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. కానీ, నన్ను లోపలికి అనుమతించలేదు. ఇర నా పిల్లలతో ఎప్పుడూ అక్కడికి వెళ్లను’ అంటూ ఒలింపిక్స్‌ 2024ను ట్యాగ్‌ చేస్తూ సెరెనా పోస్టు షేర్ చేసింది. అయితే సెరెనా కామెంట్స్ పై పెనిన్‌సులా రెస్టరెంట్ స్టాఫ్‌ మాక్సిమ్ మన్నెవే స్పందించారు.

ఇది కూడా చదవండి: Sexual harassment: వెంటపడి వేధించిన కామాంధులు.. తప్పించుకునేందుకు 140 కి.మీ.లు ప్రయాణించిన బాలికలు!

'సెరెనా చిన్నపిల్లలతోపాటు మరొక మహిళ వచ్చారు. వారు వచ్చేటప్పటికి కేవలం రెండు టేబుళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అది కూడా వేరే కస్టమర్స్ రిజర్వ్‌ చేసుకున్నారు. ఆ విషయాన్ని మా సిబ్బంది విలియమ్స్‌ కు వివరించారు. ఆ సమయంలో నేను అందుబాటులో లేను. సెరెనా విలియమ్స్‌ను మా కొలీగ్‌ గుర్తించలేకపోవడంతో సమస్య ఎదురైంది. టేబుల్‌ ఖాళీ అయ్యవరకూ బార్‌ వద్ద వేచి ఉండాలని సూచించారు. ఇక్కడేదీ వ్యక్తిగతం కాదు. సెరెనా విలియమ్స్‌ అంటే మాకెంతో గౌరవం. మా అతిథుల కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. ఆమె తప్పకుండా మరోసారి వస్తారని ఆశిస్తున్నాం’ అంటూ మాక్సిమ్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisment
తాజా కథనాలు