Sensex Trend: ఎప్పటికప్పుడు మారుతూ ఉండే స్టాక్ మార్కెట్ ఒక్కోసారి ఊహించని లాభాలను అందిస్తూ ఉంటుంది. అంతలోనే తీరని నష్టాలనూ తీసుకువస్తుంది. ఈ అస్థిరతల మధ్య స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే, ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Sensex Trend) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఎంత నిపుణుల సలహాలు తీసుకున్నా.. కొంత రీసెర్చ్ కూడా అవసరమే. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అందుకే అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే మంగళవారంనాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం.
పూర్తిగా చదవండి..Sensex Trend: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు?
నిన్న (డిసెంబర్ 27) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగింది. 72,038 వద్ద ముగిసింది. నిఫ్టీ 213 పాయింట్ల లాభంతో 21,654 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 లాభపడగా 3 మాత్రమే పతనమయ్యాయి.
Translate this News: