Sensex Today: పరుగులు పెడుతున్న సెన్సెక్స్.. లాభాల జోరు!

దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్లిష్ రన్ కొనసాగుతోంది. నిన్నటి ఆల్ టైమ్ హై జోరును కొనసాగిస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈరోజు బుల్లిష్ రన్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

New Update
Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ!

నిన్నటి రికార్డ్ హోరును కొనసాగిస్తూ ఈరోజు అంటే ఏప్రిల్ 10న స్టాక్ మార్కెట్‌లో(Sensex Today) పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 74,950 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది. 22,700 స్థాయిలో ట్రేడవుతోంది.

Also Read: డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. 

ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్(Sensex Today) స్టాక్‌లలో, 22 స్టాక్స్ పెరుగుదల కనబరిచాయి. అలాగే 8 స్టాక్స్ లో క్షీణత కనిపించింది. ఈరోజు కూడా మెటల్ - బ్యాంకింగ్ షేర్లలో మరింత పెరుగుదల ఉంది. అంతకు ముందు నిన్న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసిన విషయం తెలిసిందే. 

మార్చి 2025 నాటికి సెన్సెక్స్ 86,000కి చేరుకునే ఛాన్స్..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెక్నికల్ చార్ట్‌లలో BSE సెన్సెక్స్(Sensex Today) బలంగా కనిపిస్తోంది. కాసేపట్లో ఇది 75,850 స్థాయిని దాటవచ్చు అని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిఫ్టీ-50 దాదాపు 15% వృద్ధిని చూస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రకారం సెన్సెక్స్ 86,000 స్థాయికి చేరుకోవచ్చని అంచనా.

మార్కెట్ పెరగడానికి 3 కారణాలు...

  • త్వరలో జరగబోయే ఎన్నికలతో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
  • గత సెషన్‌లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో రూ.1,659.27 కోట్ల పెట్టుబడులు పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపింది.
  • జూన్‌లో అమెరికా వడ్డీరేట్లలో కోత పెట్టవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.

నిన్న మార్కెట్ ఆల్ టైమ్ హై
అంతకుముందు నిన్న అంటే ఏప్రిల్ 9న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని చేసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్(Sensex Today) 75,124 స్థాయిని, నిఫ్టీ 22,768 స్థాయిని తాకాయి. అయితే దీని తర్వాత మార్కెట్‌లో స్వల్ప క్షీణత ఏర్పడి సెన్సెక్స్ 58 పాయింట్లు పడిపోయి 74,683 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు పతనమై 22,642 వద్ద ముగిసింది.

Advertisment
తాజా కథనాలు