Darshan : 5 లక్షల సుపారీ ఇచ్చి.. ఫ్యాన్స్ తోనే హత్య చేయించి.. కన్నడ స్టార్ దర్శన్ కేసులో సంచలన నిజాలు!

కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో సంచలనం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి..

Bengaluru: మీరు చేసిన పనులకు అన్ని సౌకర్యాలు ఉండవు..దర్శన్‌కు చివాట్లు పెట్టిన కోర్టు
New Update

Sensational Facts In Kannada Star Darshan Case : కన్నడ (Kannada) స్టార్ హీరో దర్శన్ (Darshan) కేసులో సంచలనం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసు (Murder Case) లో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు. తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.

ఫ్యాన్స్ తోనే ప్లాన్ చేసి..

పోలీసుల వివరాల ప్రకారం.. హతుడు రేణుకాస్వామి దర్శన్‌ అభిమాని. అయితే అతడు నటి పవిత్రా గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వస్తున్న ఆరోపణలతో తమ హీరో పేరుప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అతడు భావించేవాడు. దీంతో ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించేవాడు. దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పింది. ప్రియురాలిని వేధిస్తున్న రేణుకా స్వామిపై ఆగ్రహించిన దర్శన్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్‌, కేశవమూర్తిని సంప్రదించాడు.

Also Read : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!

5 లక్షల సుపారీ ఇచ్చి...

తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగటంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్‌ తొలుత వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్టయితే అవసరమైన లీగల్‌ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్‌ అభిమానులు అతడిని కామాక్షి పాల్యలోని ఒక షెడ్‌లోకి తీసుకెళ్లారు.

అక్కడికి వచ్చిన దర్శన్‌ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్‌ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్‌కు తెలియజేసి , పరిస్థితిని చక్కదిద్డడానికి మరో రూ.25 లక్షలు తీసుకున్నారు. రేణకా స్వామి (Renuka Swamy) మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు.

#darshan-renuka-swamy #kannda-actor-darshan #actor-darshan-murder-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe