AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్!

ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..

AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్!
New Update

AP : కొత్తగా కాలేజీల్లో చేరిన స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరిట తోటి సీనియర్ స్టూడెంట్స్ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ ర్యాగింగ్ ను మాత్రం అరికట్టలేకపోతుంది. ర్యాగింగ్ పేరిట చేసే వికృత చేష్టలకు ఎంతో మంది స్టూడెంట్స్ బలవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేట లో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ఈ ఘటన వెలుగు చూసింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఈ ర్యాగింగ్ ఫిబ్రవరిలో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు ఇలా వికృత చేష్టలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : నాగుపాముతో చలగాటం ఆడిన యువకుడు.. చివరికి..!

కాగా ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. కానీ సోషల్ మీడియా వేదికగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కాలేజీలో ర్యాగింగ్ ఈ స్థాయిలో ఉంటుందని ఓ విద్యార్థి తండ్రికి చెప్పే క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆ కాలేజీ హాస్టల్లో ఉంటున్న జూనియర్లపై సీనియర్లు తరచూ చిత్రహింసలు పెడుతుంటారట.

రాత్రిపూట జూనియర్లను బయట నిల్చోబెట్టి.. సీనియర్లు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచారు. ఆపై వారి రెండు మోచేతులు నేలపై పెట్టించి.. కర్రలతో పిరుదులపై విపరీతంగా కొట్టారు. దెబ్బకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తుంటే.. సీనియర్లు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ రాక్షస క్రీడకు వార్డెన్ సైతం సహకరిస్తుంటారని.. ప్రిన్సిపాల్ కు తెలిసిన అడ్డుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

#ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe