ap election: వైసీపీకి రివర్స్‌ షాక్‌ తప్పదు.. తులసీరెడ్డి హెచ్చరిక

వైసీపీ ప్రభుత్వం కూతల, కోతల, వాతల ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీరెడ్డి అన్నారు. ఒకవైపేమో కరెంట్‌ కోతలు, మరోవైపు విద్యుత్‌ బిల్లుల వాతలు ఎక్కువయ్యాయని చెప్పారు.

New Update
ap election: వైసీపీకి రివర్స్‌ షాక్‌ తప్పదు.. తులసీరెడ్డి హెచ్చరిక

సాధారణంగా కరెంట్‌ తీగలు పట్టుకుంటే షాక్‌ కొడుతుందని, జగన్‌రెడ్డి పాలనలో మాత్రం కరెంట్‌ తీగ అవసరం లేదని, బిల్లు ముట్టుకుంటేనే షాక్‌ కొడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీరెడ్డి (TulsiReddy) ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్‌మోహన్‌రెడ్డి (cm jagan) వైసీపీ అధికారంలోకి వస్తే కరెంట్‌ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఊరూవాడ ఊదరగొట్టారని, ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు.. దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎనిమిది సార్లు కరెంట్‌ చార్జీలు పెంచారని, దాని పర్యవసానంగా విద్యుత్‌ వినియోగదారులపై 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: టీడీపీపై మండిపడ్డ బొత్స, వైవీ సుబ్బారెడ్డి..బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడి

అంతేకాకుండా ఇళ్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పేరుతో మళ్లీ 13 వేల కోట్ల రూపాయల అదనపు భారం వేయబోతున్నారని, అదీ సరిపోక వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్ల పేరుతో 6,888 కోట్ల రూపాయలు అదనపుభారం మోపబోతున్నారని తులసిరెడ్డి (TulsiReddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు తయారైందని, ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ సర్వీస్‌ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, విద్యుత్‌ సుంకంలాంటి రకరకాల పేర్లతో బాదుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా జగన్‌రెడ్డి తన పేరును బాదుడురెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. ఏరుదాటినంత వరకు ఓడమల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అనే నైజాన్ని వైసీపీ ప్రదర్శిస్తోందని, వచ్చే ఎన్నికల్లో విద్యుత్‌ వినియోగదారులు ఆ పార్టీకి, జగన్‌ మోహన్‌రెడ్డికి రివర్స్‌ షాక్‌ ఇవ్వకతప్పదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ను కనిపించకుండా చేస్తారు తస్మాత్‌ జాగ్రత్త అంటూ వైసీపీని తులసిరెడ్డి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్… కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు

Advertisment
Advertisment
తాజా కథనాలు