Breaking: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత!

కాంగ్రెస్ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

New Update
Breaking: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత!

Breaking: కాంగ్రెస్ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో.. అతను రెండుసార్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి చేశారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఆరిఫ్ అకిల్ 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆరిఫ్ తన కొడుకు అతిఫ్ ను భోపాల్ నార్త్ సీటు నుంచి 2023లో బరిలో నిలిపారు. అతిఫ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 1984లో భోపాల్‌లో జరిగిన యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఆరిఫ్ కి ప్రజల్లో తన ఇమేజ్‌ పెరిగింది. ఫ్యాక్టరీకి కొంత దూరంలో ఆరిఫ్ నగర్ అనే పట్టణాన్ని స్థాపించారు. గ్యాస్ దుర్ఘటన బాధితులు, వారి కుటుంబాలు ఈ స్థలంలో స్థిరపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.

Also read: మదనపల్లిలో అర్థరాత్రి కాల్పుల కలకలం!

Advertisment
తాజా కథనాలు