Nagababu : సినిమా ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

'కమిటీ కుర్రోళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నాగబాబు మెగా ఫ్యామిలీ విభేదాలపై, సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ మా తాత, నాన్నల సామ్రాజ్యం కాదు. మనందరిదీ. ఎందరో వ్యక్తులు సినీ నేపథ్యం లేని వారే. అందరూ ప్రతిభతో ఎదిగారని అన్నారు .

New Update
Nagababu : సినిమా ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Senior Actor Nagababu Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కమిటీ కుర్రోళ్ళు'. 11 మంది కొత్త నటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9 న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ తాజాగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వచ్చిన నాగబాబు మెగా ఫ్యామిలీ విభేదాలపై, సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.." 'వీళ్లు తప్ప ఇంకెవరూ ఉండరు' అంటూ మెగా ఫ్యామిలీపై కొందరు అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మాకు అలాంటి ఫీలింగ్‌ లేదు. చిత్ర పరిశ్రమ మా తాత, నాన్నల సామ్రాజ్యం కాదు. అలాగే అక్కినేని, నందమూరి తదితర కుటుంబాలకే పరిమితం కాదు. మనందరిదీ. అడివి శేష్‌లాంటి ఎందరో వ్యక్తులు సినీ నేపథ్యం లేని వారే. ప్రతిభతో ఎదిగారు. మిటీ కుర్రోళ్లు’లో నటించిన వారు ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. ఎవరూ ఊహించలేం" అని అన్నారు. కమర్షియల్‌ సినిమా కాకుండా కథా బలమున్న చిత్రాలు చేయాలని వర్ధమాన నటులకు సూచించారు. దీంతో నాగబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు