Ajay Ghosh : సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి బూతులు తిట్టొచ్చు.. అజయ్ ఘోష్ ఓపెన్ ఛాలెంజ్, నంబర్ కూడా ఇచ్చేసాడుగా!

సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా ఇది. నచ్చకపోతే నాకు ఫోన్‌ చేసి బూతులు తిట్టొచ్చు" అని అన్నాడు.

New Update
Ajay Ghosh : సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి బూతులు తిట్టొచ్చు.. అజయ్ ఘోష్ ఓపెన్ ఛాలెంజ్, నంబర్ కూడా ఇచ్చేసాడుగా!

Senior Actor Ajay Ghosh Speech At Music Shop Murthy Pre Release Event : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓపెన్ ఛాలెంజ్...

తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.." చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అందరికీ నచ్చుతుంది. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా ఇది. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్‌ చేసి బూతులు తిట్టొచ్చు" అని చెబుతూనే తన నంబర్‌ కూడా ఇచ్చేశాడు. దీంతో అజయ్ ఘోష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : మోదీ, చిరంజీవి మధ్య జరిగిన సంభాషణ ఇదే.. బయటపెట్టిన మెగాస్టార్!

కాగా ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అజయ్ ఘోష్.. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఫస్ట్ టైం లీడ్ రోల్ ప్లే చేశారు. ఇందులో ఆయన మ్యూజిక్ షాప్ రన్ చేసే వాడిగా కనిపించనున్నాడు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని అజయ్ ఘోష్ భార్యగా నటించింది.

Advertisment
తాజా కథనాలు