హైదరాబాద్‌లో హెరాయిన్ పట్టివేత

నగరంలో మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా నడుస్తోంది. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా.. ఏదో రకంగా నగరంలోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయి. ఇలాంటి ఘటన టోలిచౌకిలో తాజాగా వెలుగులోకి వచ్చింది.

New Update
హైదరాబాద్‌లో హెరాయిన్ పట్టివేత

Seizure of narcotics in Hyderabadమత్తు పదార్థాలు  స్వాధీనం

హైదారబాద్‌లో పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. సిటీలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగ చేస్తూ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈనెల 21న టోలిచౌకీ ప్రాంతంలో మాదకద్రవ్యాలు తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అతడి వద్ద ఉన్న 8.56 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

ముంబై నుంచి హెరాయిన్

అయితే.. అవసరం ఉన్న వారికి హెరాయిన్ విక్రయించేందుకు తెచ్చిన మత్తు పదార్థాలను ఎక్సైజ్ పోలీసులు ఫిలింనగర్‌లో పట్టుకున్నారు. ఓ వ్యక్తి హెరాయిన్ తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్నాడనే సమాచారం రావడంతో శంషాబాద్ సిఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది టోలిచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హెరాయిన్ లభించింది. నిందితుడు ముంబై నుంచి హెరాయిన్ తీసుకుని వచ్చాడని విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు