Shampoo: షాంపూలో కొంచెం ఉప్పు కలిపితే జరిగే అద్భుతాలు చూడండి

జుట్టును రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. నూనెలో ఉప్పు క‌లిపి త‌ల‌కు పట్టించి మర్దనా చేస్తే మూసుకుపోయిన జుట్టు రంధ్రాలు ఓపెన్‌ అవుతాయని వైద్యులు అంటున్నారు.

New Update
Shampoo: షాంపూలో కొంచెం ఉప్పు కలిపితే జరిగే అద్భుతాలు చూడండి

Shampoo: మంచి ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరికీ జుట్టే అందం. జుట్టును రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. త‌లలో ల‌క్ష వెంట్రుక‌లు ఉంటాయి. అందులో మామూలుగానే రోజుకు వంద వెంట్రుకలు రాలుతూ ఉంటాయి.

publive-image

వంశపారంపర్యంగా కూడా జుట్టు ఊడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథి విడుద‌లచేసే హార్మోన్లు ఎక్కువ, తక్కువ రావడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు, ఇన్‌ఫెక్షన్‌తో కూడా రాలుతుంది. జుట్టును కాపాడటంలో ఉప్పు బాగా పనిచేస్తుంది. మనం వాడే షాంపులో రెండు లేదా మూడు స్పూన్ల ఉప్పు కలిపి. తలకు బాగా పట్టించాలి. 10 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి.

publive-image

ఇలా చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది, చుండ్రు కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా జుట్టు పెరగడానికి ఉప్పు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉప్పును స్క్రబ్‌లా ఊడా వాడుకోవచ్చు. మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు పాపిడి మధ్యలో ఉప్పు చల్లి తర్వాత 10 నిమిషాలు మర్దనా చేయాలి. తలస్నానం చేయడం వల్ల చుండ్రు పోతుందని నిపుణులు అంటున్నారు.

publive-image

అంతేకాకుండా.. తలపై ఎక్కువగా ఉన్న నూనెను కూడా ఉప్పు పీల్చివేస్తుంది. నూనెలో ఉప్పు క‌లిపి త‌ల‌కు పట్టించి మర్దనా చేస్తే మూసుకుపోయిన జుట్టు రంధ్రాలు ఓపెన్‌ అవుతాయని వైద్యులు అంటున్నారు. గతంలో కంటే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకున్నారంటే కష్టాలు తప్పవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు