Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!

రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్‌ రైల్వే. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్‌ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ.

Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!
New Update

హైదరాబాద్ (Hyderabad) లో ఒక చోట నుంచి మరోక చోటకి వెళ్లాలంటేనే చాలా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. మెట్రోలు వచ్చాక ప్రయాణాలు సులభం అయ్యాయి కానీ, ఖర్చు మాత్రం తగ్గలేదు. అలాంటిది పక్క జిల్లాకి వెళ్లాలంటే..ఇక అంతే సంగతులు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లాలంటే బస్‌ ఖర్చులు..140 రూపాయలు.

రెండు వైపులా అయితే రూ.280 . నెల రోజులు రైలుల ప్రయాణించే వారికి అయితే ఎంత అవుతుంది ఇక మాటల్లో చెప్పాక్కర్లేదు. అలాంటింది రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్‌ రైల్వే. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్‌ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ.

Also read: బీజేపీకి బిగ్‌ బూస్ట్.. ఈటల, కిషన్‌రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..!

అక్టోబర్ మూడున ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్- సిద్దిపేట ప్యాసింజర్‌ రైలు ఆ ప్రాంత వాసులకు ఈ ప్రయాణాన్ని అందిస్తుంది. 117 కి.మీ దూరానికి రైలు టికెట్‌ ధర 60 లుగా ఉండగా ఇప్పుడు దానిని మరింత చౌకగా మారుస్తూ నెలవారీ సీజన్‌ టికెట్‌ అందుబాటులోకి వచ్చింది.

మామూలు టికెట్ ప్రకారం..వెళ్లి రావటానికి రూ.120 అయితే నెలకు 3,600 అవుతుంది. కానీ ఇప్పుడు నెల రోజుల సీజన్ టికెట్‌ కొంటే కేవలం రూ.440 తో నెల రోజుల పాటు ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న పేదవారికి ఇది గొప్ప అవకాశమనే చెప్పుకొవచ్చు.

ఈ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ వెసులుబాటును కల్పించాలని రైల్వే శాఖ ఆలోచిస్తుంది. ప్రస్తుతం అమలులో టికెట్‌ రూ.60 నుంచి రూ.50 తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్‌ టికెట్ ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ నుంచి 135 కి.మీ వరకు ప్రయాణ దూరానికి సీజన్‌ టికెట్‌ ధర రూ.440 గా ఉంటుంది.

సికింద్రాబాద్‌ సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం రూ.117 కి.మీ ఉంది. దీంతో ఈ టికెట్‌ ధరను రూ.440 గా నిర్ణయించారు. ప్రతి నెల దీనిని రెన్యూవల్ చేసుకోవచ్చు. స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి టికెట్‌ ధర ఉంటుంది. ఉదయం సిద్దిపేట నుంచి బయల్దేరితే..సికింద్రాబాద్ కి 10 గంటలకు చేరుకుంటుంది. ఇలా అల్టారేనేటివ్‌ టైమింగ్స్‌ తో ఈ రైలు నడుస్తుంది.

#siddipet #secundrabad #railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe