BREAKING: దేశవ్యాప్తంగా ముగిసిన రెండోదశ పోలింగ్

దేశవ్యాప్తంగా రెండోదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ స్థానాల్లో సాయంత్రం 5 గంటలవరకు 61శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా త్రిపురలో 76శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా యూపీలో 44.13 శాతం ఓటింగ్ నమోదైంది.

New Update
BREAKING: దేశవ్యాప్తంగా ముగిసిన రెండోదశ పోలింగ్

Second Phase Lok Sabha Election Poll: దేశవ్యాప్తంగా రెండోదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగగా.. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా త్రిపురలో 76 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా యూపీలో 44.13 శాతం ఓటింగ్ నమోదైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

* అస్సాం - 70.66%
* బీహార్ - 53.03%
* ఛత్తీస్‌గఢ్ -72.13%
* జమ్మూ కాశ్మీర్ - 67.22%
* కర్ణాటక - 63.9%
* కేరళ - 63.97%
* మధ్యప్రదేశ్ - 54.83%
* మహారాష్ట్ర - 53.5%
* మణిపూర్ - 76.06%
* రాజస్థాన్ - 59.19%
* త్రిపుర - 76.23%
* ఉత్తరప్రదేశ్ - 44.13%
* పశ్చిమ బెంగాల్ - 71.04%

Advertisment
తాజా కథనాలు