ఆంధ్రప్రదేశ్ Srisailam: హమ్మయ్యా.. మొత్తానికి శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. అయితే చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగు బంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : యార్లగడ్డను వైసీపీ అవమానించిందా? పొమ్మనలేక పొగపెట్టిందా? వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Man Commits Suicide: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్(30) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే డబ్బులు సర్దుబాటు కాక సమయానికి డబ్బులు కట్టలేకపోయాడు. కొంత మొత్తమే తిరిగి చెల్లించాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం హేమంత్ మృతిపై తండ్రి గున్న శ్రీనివాసరావు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Leader Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేష్.. పాదయాత్రకి బ్రేక్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగళూరు శాంతి ప్రసాద్ పై లోకేష్ గతంలో పరువు నష్టం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బంగాళా ఖాతంలో అల్పపీడం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్!! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM YS Jagan Tour in Vijayawada: రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ School Building wall collapsed : కూలిన ప్రభుత్వ పాఠశాల గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లె మండల హుసేనాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గోడ ఒకటి కూలిపోయింది. అయితే ఆ సమయంలో భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలున్నారు. పాఠశాల భవనం మరమ్మత్తు చేసేందుకు నాడు నేడు కింద రూ.12.5 లక్షలు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు మాత్రం జరగడం లేదు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: సర్పంచులతో చంద్రబాబు సమావేశం.. ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రాబాబు పర్యటన కొనసాగుతుంది. గురువారం చంద్రబాబు మండపేటలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని పేర్కొన్నారు చంద్రబాబు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn