ఆంధ్రప్రదేశ్ TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konaseema Arson Case: మంత్రి విశ్వరూప్ తనయుడికి నిరసన సెగ.. అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం!! అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సమస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను.. ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోగస్ సభ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సీఎం సూచన భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan London Tour: ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు పర్మిషన్.. వచ్చే నెల 2న విదేశాలకు జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తమ కూతుళ్లను చూసేందుకు సీఎం జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Another Woman Killed in Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..! చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!! ఆంధ్ర ప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వానలు పడాల్సింది పోయి.. ఎండలు మండిపోతున్నాయి. నిజానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్, జులై, ఆగష్టు నెలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అరేబియా సముద్రం, బంగాళా ఖాతంలో రుతు పవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి వర్షాలు కురవాలని. కానీ ఈ ఏడాది పెద్దగా వర్షాలు కురవలేదు. ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ లో రుతుపవనాల ప్రభావం లేదని అంటున్నారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Twist in Student Ritu Sahu Incident: వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!! వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn