లైఫ్ స్టైల్ Alcohol Side effects: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!! ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సాయంత్రం, రాత్రివేళల్లోనే కాదు.. రోజంతా బార్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయింది. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీ, బార్, పబ్, హోటల్ లో ఆల్కహాల్ తో పాటు.. ఆహారపదార్థాలు కూడా వడ్డిస్తారు. మద్యంతో పాటు కొన్నిరకాల ఆహారాలను ఆర్డర్ చేస్తారు. ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం.. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ House Arrest of TDP Leaders: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Garlic Health Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!! మనం నిత్యం ఉపయోగించుకునే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. మనం వండే వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తూంటాం. వెల్లుల్లితో ఎన్నో అనారోగ్య సమస్యలు, వ్యాధులకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. అంత శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిని ఏ రూపంలో మనం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Monsoon Teas: ఈ టీలు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. ఆ వ్యాధులకు చెక్ పెడుతుంది! వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనపై ఎఫెక్ట్ చూపకుండానే ఇమ్యునిటీని పెంచుకోవాలి. చిన్నారుల్లోనూ, పెద్ద వారిలోనూ ఫ్లూ, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేందుకు మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని కషాయాలు, టీలు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా. వర్షాకాలం, చలికాలాల్లో ఈ టీ తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kidneys Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ సూపర్ గా పని చేస్తాయి!! శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!! కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Differences in Denduluru YCP: దెందులూరు వైసీపీలో రగడ.. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై నేతల తిరుగుబాటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి చిక్కులు ఎదురువుతున్నాయి. 175కి 175 సీట్లు సాధిస్తామంటోన్న నేతలకు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంతి. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి పాలవ్వడం ఖాయమని అంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయానికి కృషి చేస్తామని తెగేసి చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో బయటపడ్డ వర్గపోరు ఇప్పుడు ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా? విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkatrao) నియమితులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆదేశాల ప్రకారం యార్లగడ్డను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn