చాలామంది తెల్ల, పచ్చ జొన్నలు తమ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహారంలో భాగం చేసుకుంటారు. ప్రస్తుతం దేశంలో మరో రకం జొన్న పంట సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధలు చేస్తున్నారు. అయితే తియ్యగా ఉండే ఈ రకం జొన్న తినడానికి ఉపయోగించరు. ఇందులో ఇథనాల్ ఎక్కువగా లిభిస్తుంది. దీన్ని పెట్రోల్‌లో కలిపేందుకు వినియోగిస్తున్నారు. పెట్రోల్ దిగుమతిని తగ్గించి, పర్యావరణాన్ని రక్షించేందుకు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 12 శాతం ఇథనాల్ మాత్రమే పెట్రోల్‌లో కలుపుతున్నారు.
Also Read: 2 నెలల్లో సీఎం మారబోతున్నాడు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
పుష్కలంగా ఇథనాల్
ఇప్పటిదాకా.. చెరకు నుంచి తీసిన ఇథనాల్‌ను మాత్రమే వాడుతున్నారు. చెరకు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. అందుకే ఇథనాల్ ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృషి సారించారు. తియ్యటి జొన్న పంటలో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుందని గుర్తించి.. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) తోడ్పాటుతో దీనిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐకార్‌కు అనుబంధంగా పనిచేసే హైదరాబాద్‌లో ఉన్న భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ.. దేశంలో తియ్యటి జొన్న విత్తనోత్పత్తి కోసం సాగు చేస్తోంది.
ఇందులో భాగంగానే వరంగల్ రీజియనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS)లో కూడా రెండెకరాల్లో 'జైకార్ రసీలా' అనే రకం జొన్నను సాగు చేశారు. ఇప్పుడు అది కోతకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పంట సాగుకు ఐఐఎంఆర్ శాస్త్రవేత్త డా.ఏవీ ఉమకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తన బృందంతో కలిసి బుధవారం వరంగల్‌లో సాగైన ఈ జొన్న పంటను పరిశీలించారు.
Also read: మళ్లీ అధికారం మనదే.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
త్వరలో వాణిజ్య పంటగా
మరో విషయం ఏంటంటే.. ఈ తియ్యటి జొన్న నుంచి ఇథనాల్‌ను బయటికి తీసేందుకు ప్రత్యేకంగా ఎలాంటి యంత్రాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం చెరకు పరిశ్రమల్లో వినియోగిస్తున్న యంత్రాలను వీటికి ఉపయోగించవచ్చని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలల్లో ఏడాదిలో మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోతుందని.. ఆ సమయంలో ఈ జొన్న పంట నుంచి ఇథనాల్‌ను బయటికి తీయవచ్చని తెలిపారు. త్వరలోనే ఇది ఒక మంచి వాణిజ్య పంటగా మారే అవకాశం ఉండటమే కాకా.. పశువుల మేతకు సైతం బాగా పనికొస్తుందని స్పష్టం చేశారు.