Science Reason: సొట్టబుగ్గలపై అసలు విషయం చెప్పిన సైన్స్‌.. కారణం ఇదే

సొట్టబుగ్గలపై కొంతమందికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వాటికోసం డింపుల్ క్రియేషన్ ట్రిట్​మెంట్ తీసుకుంటారు. అయితే తల్లిదండ్రులకు సొట్టబుగ్గలు ఉంటే జన్యు లోపంతో పిల్లలకు వచ్చే ఛాన్స్​ ఉందని సైన్స్ అంటుంది.

Science Reason: సొట్టబుగ్గలపై అసలు విషయం చెప్పిన సైన్స్‌.. కారణం ఇదే
New Update

అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సొట్ట బుగ్గలు ఉంటే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వారు నవ్వినప్పుడు ఓ మ్యాజిక్‌‌లా సొట్ట ఏర్పడి అందంగా అనిపిస్తుంది. కొందరికి ఒక సైడ్‌​సొట్ట పడితే మరికొందరికి రెండు సైడ్లు సొట్ట ఉంటుంది. సొట్ట బుగ్గలు ఉంటే అందంతో పాటు అదృష్టం అని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే సొట్ట బుగ్గల వెనుక సైన్స్ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచిదంటే..!!

సొట్ట బుగ్గలు వల్ల ముఖంపై అందం పెరగడంతో పాటు అదృష్టం అని అనుకున్నా.. అయితే.. సైన్స్ మాత్రం డిఫాల్ట్​ వల్ల ఇది ఏర్పడుతుందని అంటున్నారు. మనవ శరీరం అనేక కండరాలతో నిర్మితమై ఉంది. ముఖంలోని దవడ ఎముక నుంచి నోటి వరకు ప్రధాన కండరమైన జైగోమాటిక్​మామూలుగా ఉంటుంది. పుట్టుకతోనే కొందరిలో ఈ కండరం రెండుగా చీలిపోతుంది. అప్పుడు ఈ కండరాల మధ్య ఏర్పడిన గ్యాప్‌లో చర్మం లోపలికి పోయి సొట్ట ఏర్పడుతుంది. మాట్లాడినా, నవ్వినా కండరాలు కదలడం వలన సొట్ట వచ్చి అందంగా అనిపిస్తుంది. అయితే.. పుట్టుకతో ఈ సొట్ట బుగ్గలు ఏర్పడినప్పటికీ లైఫ్ లాంగ్ ఉండక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి ఎదుగుతున్న క్రమంలో కండరాలు దగ్గరికి చేరి సొట్ట మధ్యలోనే పోతాయి.

గంటలో సొట్టబుగ్గ సొంతం

సాధారణంగా సొట్ట బుగ్గలు పడితే చాలామంది అదృష్టంగా భావిస్తారు. చాలామంది సెలబ్రిటీలను చూస్తే నిజంగానే సొట్టబుగ్గల ఉంటే అదృష్టం కలిసి వస్తుందా..? అని అనిపిస్తుంది. కానీ సొట్టబుగ్గలకు చాలా చరిత్ర ఉంది. కాగా.. తల్లిదండ్రులకు సొట్టబుగ్గలు ఉంటే పిల్లలకు 90 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. తల్లికో లేదా తండ్రికి మాత్రమే సొట్టబుగ్గ ఉంటే పిల్లలకు 40 శాతం వచ్చే అవకాశం ఉంది. సొట్టబుగ్గలపై కొంతమందికి విపరీతమైన ప్రీతి ఉంటుంది. అమ్మాయిలు ఎవరైనా డింపుల్ క్రియేషన్ ట్రిట్​మెంట్ గంటలో సొట్టబుగ్గను సొంతం చేసుకోవచ్చు. విష్ణుపురాణం ప్రకారం సొట్టబుగ్గలు ఉన్న అమ్మాయిలకు అదృష్టం ఎక్కువగా ఉంటుందట కొంతమంది పండితులు చెబుతున్నారు.

#science #cheeks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe