Scarlet Fever : చిన్నారుల్లో పెరుగుతున్న స్కార్లెట్‌ ఫీవర్‌.. నిర్లక్ష్యం చేయవద్దు!

స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది. పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది.

New Update
Scarlet Fever : చిన్నారుల్లో పెరుగుతున్న స్కార్లెట్‌ ఫీవర్‌.. నిర్లక్ష్యం చేయవద్దు!

Scarlet Fever : తెలంగాణలో(Telangana)  స్కార్లెట్‌ ఫీవర్‌(Scarlet Fever) బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీంతో చిన్న పిల్లల ఆసుపత్రిలో భారీగా బాధితులు పెరుగుతున్నారు. నిత్యం పిల్లల వార్డులో కనీసం 10-12 మంది చిన్నారులు స్కార్లెట్‌ ఫీవర్‌ బాధితులే ఉంటున్నారు. ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో ఈ ఫీవర్ ఆందోళన కలిగించినప్పటికీ కాస్త తగ్గుముఖం పట్టింది. మరోసారి ఇది విజృంభిస్తోంది.

ప్రభుత్వాసుపత్రుల్లో(Govt. Hospitals) నూ ఈ జ్వరం లక్షణాలు(Fever Symptoms) ఎక్కువగా ఉన్న చిన్నారులు కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

కేవలం జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్‌(Streptococcal Pharyngitis) అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది.

ఈ సమస్యతో బాధపడే పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది. ఇప్పటికే నగరంలోని చాలా పాఠశాలలు ఈ జ్వరం లక్షణాలతో పిల్లలు బాధపడుతుంటే స్కూల్‌ కి పంపొద్దని ఆదేశాలు జారీ చేశాయి.

ఈ జ్వరం వచ్చిన పిల్లల్లో కనిపించే లక్షణాలు : 102 డిగ్రీల జ్వరం, గొంతునొప్పి, తలతిప్పడం, వికారం, వాంతులు, శరీరం పై ఎర్రటి దద్దుర్లు, నాలుక రంగు మారడం,నాలుక పై తెల్లటి పూత, టాన్సిల్స్‌ ఎరుపు రంగులోకి మారి వాపు ఉంటుంది.

Also Read : ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు