Crime News: సినిమాలు చూసి మర్డర్లు చేస్తున్నారు జనాలు. సినిమాల నుంచి మంచి తీసుకోవడం సంగతి పక్కనపెట్టి అందులోని విషాన్ని నెత్తిన పోసుకుంటున్నారు. ఆ విషాన్నే ఇతరులపై అప్లై చేస్తున్నారు. ఏ దేశంలో చూసినా ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం ఏదో ట్రెండ్ అన్నట్టు తయారైంది. ఇంగ్లండ్-ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ చూసి ఓ మహిళ దారుణాలకు పాల్పడింది.
పిల్లిని చంపేసి.. ఆ తర్వాత యువకుడిని కూడా:
ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన స్కార్లెట్ బ్లేక్ గురించి భయంకర విషయాలు తెలుస్తున్నాయి. జార్జ్ కారెనో అనే అబ్బాయిని జూలై 25, 2021 తెల్లవారుజామున ఆక్స్‌ఫర్డ్‌లో గొంతుకోసి చంపినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. జార్జ్ కారెనోను చంపిన తర్వాత మృతదేహాన్ని సరస్సులోకి నెట్టినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి. లైంగిక సంతృప్తి కోసమే ఆమె ఇలా చేస్తుందన్న వాదనకు మరింత బలం చేకూరేలా స్కార్లెట్ ఫోన్లో వీడియోలు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో మార్ట్స్లోని ఆమె ఇంటిని చెక్ చేశారు పోలీసులు. స్కార్లెట్ బ్లేక్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వీడియోలు, ఫోటోలు జ్యూరీకి చూపించారు. అందులో చాలా వీడియోలను ఆమెనే షూట్ చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ చూసి.. ప్రేరణ పొంది:
2019లో రిలీజ్ అయిన 'డోంట్ ఫ* విత్ క్యాట్స్: హంటింగ్ యాన్ ఇంటర్నెట్ అనే డాక్యుమెంటరీ చూసి స్కార్లెట్ ప్రేరణ పొందినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఫోన్లో చిత్రకరించిన 20నిమిషాల వీడియో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక పిల్లిని చంపి దాని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసిన స్కార్లెట్.. వాటిని మిక్సీలో గ్రైండ్ చేసింది. పిల్లి కళ్లని, చర్మాన్ని వేరు చేయడాన్ని కూడా ఆమె షూట్ చేసుకుంది. ఇదంతా ఆమె లైంగిక సంతృప్తి కోసమే చేసినట్టుగా సమాచారం. జార్జ్‌ని కూడా పీక పిసికి చంపేటప్పుడు ఆమె సంతృప్తి చెందారట.
Also Read: ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..
WATCH: