TS : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇలా అప్లై చేసుకోండి!

టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు శిక్షణ ఇవ్వనుండగా మార్చి 12 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

New Update
TS : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇలా అప్లై చేసుకోండి!

Telangana Jobs : తెలంగాణ(Telangana) టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్(Revanth Sarkar) గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ(Mega DSC) లక్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్త అందించింది. ఎలాగైనా ఈసారి జాబ్ సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్లలో లక్షల్లో ఫీజులు కడుతూ అపసోపాలు పడుతున్న పేద అభ్యర్థులకు చేయూతనందించేందుకు ఫ్రీ కోచింగ్ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఎస్సీ స్టడీ సర్కిల్..
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసే నేపథ్యంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification) విడుదల చేసింది. ఇందులో భాగంగానే డీఎస్సీ దరఖాస్తు(DSC Applications)చేసుకున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్(DSC Free Coaching) ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలల పాటు ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: GROUP-1: గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

ప్రతి కేంద్రంలో 100 మంది..
ప్రభుత్వ డైట్‌, బీఎడ్‌(B. Ed)కాలేజీలతో పాటు మరిన్ని కాలేజీలతో కలిపి మొత్తం 16 కేంద్రాల్లో ఫ్రీ కోచింగ్ ఇస్తామని తెలిపింది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్‌ అందించనుండగా.. అభ్యర్థులు డైట్ లేదా టెట్‌(TS TET)లో తప్పనిసరి ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రత్యేక కేటగిరీలో..
మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న వారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మార్చి 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు ఫామ్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. http://tsstudycircle.co.in/index.html   .

https://studycircle.cgg.gov.in/TSSWDSCReg23.do

Advertisment
తాజా కథనాలు