Sanatana Dharma Row: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాలిన్‌ను మందలించిన సుప్రీంకోర్టు!

సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయన్ను మందలించింది. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. గతేడాది సెప్టెంబర్‌లో హిందు మతాన్ని ఉదయనిధి డెంగీతో పోల్చారు.

New Update
Sanatana Dharma Row: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాలిన్‌ను మందలించిన సుప్రీంకోర్టు!

Supreme Court On Udhayanidhi Stalin Row: సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు గతేడాది తీవ్ర దుమారినికి దారితీశాయి. ఉదయనిధిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు భావ వ్యక్తీకరణ హక్కులు, మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించారని ఉదయనిధి స్టాలిన్‌ను కోర్టు మందలించింది. ఈ కేసు విచారణను కోర్టు మార్చి 15కి వాయిదా వేసింది.

ఉదయనిధి ఏం అన్నారు?
ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గతేడాది సెప్టెంబర్‌లో హిందు మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దోమలు, డెంగీ, మలేరియా, కరోనాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. మన మొదటి కర్తవ్యం సనాతనాన్ని నిర్మూలించడమే తప్ప వ్యతిరేకించకూడదంటూ వ్యాఖ్యానించారు. అంటే హిందు మతాన్ని (Hinduism) నిర్మూలించాలన్నది ఉదయనిధి మాటల సారంశంగా తెలుస్తోంది. ఉదయనిధి వ్యాఖ్యల తర్వాత డీఎంకే (DMK) టార్గెట్‌గా బీజేపీ విరుచుకుపడింది. ఉదయనిధి మాటలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అటు ఉదయనిధి ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఒకసారి దోమల మందు ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టి అగ్నికి ఆజ్యంపోశాడు.

ఖర్గేపైనా అప్పట్లో కేసులు:
మతపరమైన భావాలను కించపరిచేలా ప్రవర్తించారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఐపీసీలోని సెక్షన్ 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన మతపరమైన భావాలను రెచ్చగొట్టే చర్యలు), 153 ఏ (వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. హిందూ సేన తరపున న్యాయవాది బరుణ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్జేడీ నేత చంద్రశేఖర్, వీర్ బహదూర్ సింగ్‌లపై విచారణ జరిపించాలన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం విషయంలో ఈ నేతలు హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం

Advertisment
Advertisment
తాజా కథనాలు