Nellore: కూలీలుగా మారిన ఎస్సీ హాస్టల్ బాలిక విద్యార్థులు.!

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ బాలికల హాస్టల్ లో విద్యార్థులు కూలీలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హాస్టల్ కు సంబంధించిన వస్తు సామాగ్రిలను బాలికల చేత మోయించడం వివాదాస్పదంగా మారింది.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Nellore: కూలీలుగా మారిన ఎస్సీ హాస్టల్ బాలిక విద్యార్థులు.!
New Update

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ బాలికల హాస్టల్ లో విద్యార్థులు కూలీలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హాస్టల్ కు సంబంధించిన వస్తు సామాగ్రిలను బాలికల చేత మోయించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, స్కూల్ యాజమానంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: శ్రీనాధ్ ను చంపేసింది భార్యేనా? హత్య వెనుక ఇంత పెద్ద కారణముందా?

విద్యార్థుల చేత అంత బరువైన వస్తువులను మోయించడంపై తల్లిదండ్రులు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమానంపై మండిపడుతున్నారు. బాలికలకు విద్యా నేర్పిస్తారని స్కూల్ కు పంపింతే వారిచే ఇలాంటి పనులు చేయిస్తారా? అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే స్కూల్ యాజమానంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: లోక్ సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..అసలేమైందంటే?

ఇటు, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు సైతం స్కూల్ యాజమానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కూలీల చేత చేయించాల్సిన పనులను విద్యా కోసం వచ్చిన విద్యార్ధులతో చేయించడం చట్ట పరంగా నేరం కామెంట్స్ చేశారు. ఎంతో ఆశతో చదువుకుందామని వచ్చిన బాలికలను కూలీలుగా మారుస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఇలా చేస్తే చదువుకుందామని ఆశతో ఉన్న వాళ్లు కూడా హస్టల్ కు వచ్చేందుకు భయపడుతారని వ్యాఖ్యనించారు. స్కూల్ యాజమానంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

#andhra-pradesh #nellore-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe