/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cbn-supreme-jpg.webp)
AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును సీజేఐకు బదిలీ చేస్తూ.. జస్టీస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. చంద్రబాబుకు సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తెలపగా.. ఇది వర్తించదంటూ జస్టీస్ త్రివేది భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో తదుపరి చర్యల కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐకు నివేదిస్తున్నామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.
జస్టిస్ బోస్ అభిప్రాయం
చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది
17ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే
ముందస్తు అనుమతి లేకపోతే.. తీసుకున్న చర్యలు చట్టవిరుద్దం
సెక్షన్ 13(1) C,D.. సెక్షన్ 13(2) ప్రకారం బాబును విచారణ చేయలేం
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం విచారణ చేయడం తగదు
అయితే, రిమాండ్ అర్డర్ ను క్వాష్ చేయడం కుదరదు
ముందస్తు అనుమతి తీసుకోకపోయినా రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేం
చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది--జస్టిస్ బోస్
జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయం
గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదు
చట్టం వచ్చిన తర్వాత నేరాలకు మాత్రమే 17ఏ వర్తింస్తుంది
ఉద్యోగులు కక్ష్య సాధింపుకు గురి కావద్దనేదే 17ఏ చట్టం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడినవారికి 17ఏ రక్షణగా ఉండొద్దు
2018 జరిగిన చట్ట సవరణలో క్లారిటీ లేదు
17ఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రస్తావించలేదు
Also Read: ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు చూడలేదు..వైసీపీపై చంద్రబాబు ఫైర్
రూ.371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో దీన్ని రద్దు చేయాలని గతంలో చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జులై 26, 2018 నుంచి అమల్లోకి వచ్చిన పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం, ప్రభుత్వోద్యోగిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ 2023 సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. చివరికి ఈ కేసు విస్తృత ధర్మసనానికి బదీలి చేయాలని సీజేఐకు నివేదిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.