SBI on Electoral Bonds: సమయం ఇవ్వండి.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలపై సుప్రీం కోర్టుకు  ఎస్బీఐ అభ్యర్ధన

ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు మార్చి 6వ తేదీని జూన్ 30 వరకూ పొడిగించాలని ఎస్బీఐ అప్పీల్ చేసింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ - వ్యక్తుల సమాచారాన్ని తిరిగి తీసుకోవడం.. సరిపోల్చడం సుదీర్ఘమైన అలాగే సంక్లిష్టమైన ప్రక్రియ అని కోర్టుకు ఎస్బీఐ తెలిపింది 

New Update
Electoral Bonds: అధికారిక వెబ్‌సైట్‌లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు!

SBI on Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బాండ్స్ తీసుకున్నవారి వివరాలు వెల్లడించాలని ఆ తీర్పులో ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ANI రిపోర్ట్స్ ప్రకారం, ఎలక్టోరల్ బాండ్ల(SBI on Electoral Bonds) వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించడానికి జూన్ 30 వరకు వ్యవధి ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీలోగా వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్‌లను డీకోడింగ్ చేయడం దానిని  దాతల విరాళాలతో సరిపోల్చడం సంక్లిష్టమైన ప్రక్రియ అని SBI అంటోంది. సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ దాఖలు చేసిన అప్పీల్‌లో, ప్రతి ఎలక్టోరల్ బాండ్ - దానితో అనుబంధించిన వ్యక్తి సమాచారాన్ని తిరిగి తీసుకోవడం..  ఒకదానితో ఒకటి సరిపోల్చడం (SBI on Electoral Bonds)సుదీర్ఘమైన అలాగే సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో ఈ పని కోసం  మరింత సమయం కావాలి. దీనికి కారణం ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేటప్పుడు, దాత గుర్తింపును గోప్యంగా ఉంచేలా చేశారు.  దీని కోసం ప్రత్యేక ప్రక్రియతో ప్రోగ్రామ్ ను అనుసరించారు.  ఇప్పుడు దానిని డీకోడ్ చేయడానికి సమయం పడుతుంది.

ఈ వివరాలన్నింటినీ ఎస్‌బీఐ ఇవ్వాల్సి ఉంది
ఎలక్టోరల్ బాండ్ల(SBI on Electoral Bonds) విషయంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఇచ్చిన 'సమాచార హక్కు'ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, ఈ బాండ్ల జారీని వెంటనే నిషేధించడమే కాకుండా, ఏప్రిల్ 2019 నుండి కొనుగోలు చేసిన అన్ని ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని మార్చి 6 లోపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని కూడా SBIని ఆదేశించింది.

Also Read:  భారీగా తగ్గిన పంచదార ప్రొడక్షన్.. ధరలపై ప్రభావం పడుతుందా? 

ఎలక్టోరల్ బాండ్ల (SBI on Electoral Bonds)సమాచారాన్ని ఎస్‌బీఐ షేర్ చేసి ఉంటే, ఏ పార్టీకి ఎంత ఎన్నికల విరాళాలు వచ్చాయో తెలిసిపోయేది. ఏ కార్పొరేట్ హౌస్, వ్యాపారవేత్త లేదా మరే ఇతర వ్యక్తి ఈ విరాళాన్ని ఇచ్చారు అనే వివరాలు స్పష్టం అయ్యే అవకాశం ఉంది.  2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రకారం, ఏ వ్యక్తి లేదా కంపెనీ అయినా ఈ బాండ్లను SBIకి చెందిన ఎంపిక చేసిన శాఖల నుండి కొనుగోలు చేసి, వారికి ఇష్టమైన రాజకీయ పార్టీకి ఇవ్వవచ్చు. పార్టీ ఈ బాండ్‌ను 15 రోజుల్లోగా క్యాష్ చేసుకోవాలి.

Advertisment
తాజా కథనాలు