Telangana : కాంగ్రెస్‌కు సర్వే సత్యనారాయణ షాక్‌.. రెబల్ అభ్యర్థిగా నామినేషన్

కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సర్వే సత్య నారాయణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు మల్కాజ్‌గిరీ ఎంపీగా కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు.

New Update
Telangana : కాంగ్రెస్‌కు సర్వే సత్యనారాయణ షాక్‌.. రెబల్ అభ్యర్థిగా నామినేషన్

Congress : కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సర్వే సత్య నారాయణ(Sarvey Satyanarayana) కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు మల్కాజ్‌గిరీ ఎంపీగా కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ(BJP) నేత అయిన శ్రీ గణేష్‌ను పార్టీలోకి తీసుకోని కంటోన్మెంట్‌ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై సర్వే సత్య నారాయణ ఆగ్రహంలో ఉన్నారు. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా శ్రీ గణేష్‌(Sri Ganesh) కు టికెట్‌ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Also Read: నామినేషన్లకు నేడే చివరి తేది.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే

దీంతో చివరికి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి కాంగ్రెస్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు సర్వే సత్య నారాయణ. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సర్వే గెలిచారు. ఆయనకు ఆ నియోజకవర్గంలో ఓట్‌ బ్యాంక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్.. సర్వేను బజ్జగిస్తుందా.. ఆయన వెనక్కి తగ్గుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు గతంలో సర్వేకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇక మే 13న లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Also Read: నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు