Sarkari Naukri OTT Release: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో.. R.K టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో కథానాయికగా భావన డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. తనికెళ్ళ భరణి, మధులత, సాయి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, మని చందన మహాదేవ్ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 1 న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రేక్షకులలో అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది.
ఓటీటీ రిలీజ్
ఇక ఇప్పుడు.. ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ఓటీటీ లోకి నౌకరి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోందో. థియేటర్ రిజల్ట్స్ కారణంగానే ఇంత త్వరగా ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. సర్కారు నౌకరి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. జనవరి 26 అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సర్కారు ఉద్యోగిగా ఆకాష్ పాత్రకు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.
మూవీ స్టోరీ
ఈ చిత్రంలో హీరో(గోపాల్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. గ్రామంలో కండోమ్స్ వాడకం పై అవగాహన కల్పించడం. వాటిని గ్రామంలో అందరికి అందుబాటులోకి తీసుకురావడం హీరో జాబ్. ఇలాటి ఉద్యోగం చేయడం హీరో భార్యకు నచ్చదు.. దాంతో భార్య నేను కావాలా.. జాబ్ కావాలా తేల్చుకోమని చెప్తుంది. ఆ తరువాత హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు..? కండోమ్స్ పంచె ఉద్యోగం చేస్తున్న గోపాల్ కు సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి అనేది "సర్కారు నౌకరి" కథ.
Also Read: Sankranthi 2024: సంక్రాంతికి రంగరంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెలు.. కారణమేంటో తెలుసా?