SARFARAJ KHAN: దయచేసి క్షమించండి మిస్టర్ గవాస్కర్ సార్! By Durga Rao 13 Mar 2024 in Uncategorized New Update షేర్ చేయండి దయచేసి నన్ను క్షమించండి మిస్టర్ సునీల్ గవాస్కర్ సార్ అంటూ టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ఇంగ్లాడ్ తో జరిగిన 5వటెస్ట్ సిరీస్ లో జరిగిన తప్పిదం మరొసారి జరగకుండా చూసుకుంటానని సర్ఫరాజ్ ఖాన్ స్ఫష్టం చేశాడు. ఇంగ్లాడ్ టెస్ట్ సిరీస్ తో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ఆటను కనబరిచాడు. మూడు మ్యాచుల్లో 3 అర్థసెంచరీలతో 200 పరుగుల పైగా చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఒక విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనానికి గురైయాడు. క్రీజులో నిలదోక్కుకున్నాక చెత్త షాట్ లు ఆడి వికెట్ ను సమర్పించుకోవటం సరికాదని ఆయన అన్నాడు. ఈ నేపథ్యంలో ప్రతీసారి కొత్త బంతిని ఎదుర్కుంటాననే భావనతో ఆడే బ్రాడ్ మ్యాన్ వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. గవాస్కర్ వ్యాఖ్యలకు సర్ఫరాజ్ బాధపడినట్లు ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా వెల్లడించారు. సునీల్ గవాస్క్ ర్ కు ఆయన అత్యంత ఆఫ్తులు. సర్ఫరాజ్ తో మ్యాచ్ మధ్యలో సుమారు 50 నిమిషాల పాటు గవాస్కర్ సంభాషించారని.. చెత్త షాట్లతో వికెట్ కోల్పోవద్దని సర్ఫరాజ్ కు సూచించారని భాటియా అన్నారు. కాని టీ బ్రేక్ అనంతరం చెత్త షాట్ తో సర్ఫరాజ్ వికెట్ కోల్పోవటంపై సన్నీ కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెంటేటరీ సందర్భంగా ఆ విషయాన్ని ఆయన చెప్పాడు. మరుసటి రోజు సర్ఫరాజ్ నా వద్దకు వచ్చి సన్నీ సార్ కు నేను క్షమాపణ చెబుతున్న మరొసారి ఈ తప్పిదం జరగదని చెప్పండి అని యువ ఆటగాడు అన్నాడని శ్యామ్ భాటియా తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి