/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sarparaj-jpg.webp)
Bharat : భారత్ కు చెందిన సరబ్ జిత్ సింగ్(Sarabjit Singh) ను జైలులో అత్యంత కిరాతకంగా చంపిన పాక్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్(Under World Don) అమిర్ సర్పరాజ్(Amir Sarfaraz) ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కాల్చి చంపేశారు. ఆదివారం లాహోర్ లో ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి తుపాకీతో కాల్చి చంపారు. పాక్ జైలులో ఉన్న సరబ్ జిత్ సింగ్ పై దాడి చేసినందుకు సర్పరాజ్ పై కేసు నమోదు అయ్యింది.
కానీ అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో పాక్ కోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్ లో అతనిని అతి దగ్గర నుంచి తుపాకీ తో కాల్చి చంపారు. పంజాబ్ కు చెందిన సరబ్‌జీత్ సింగ్ అనుకోకుండా భారత్-పాక్ సరిహద్దును దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. వెంటనే సరబ్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం.. అతనిపై గూఢచారి ముద్రవేసి 1990లో జైల్లో పెట్టింది. అయితే అప్పట్లో సరబ్‌జీత్ సింగ్ అరెస్ట్ ను భారత ప్రభుత్వం(Indian Government) తీవ్రంగా ఖండించింది.
సరబ్‌జీత్ ను విడిచిపెట్టాలని అతని సోదరి దల్భీర్ కౌర్‌తోపాటుగా.. కుటుంబం పలుమార్లు పాకిస్తాన్ ను కోరినా సరే ఫలితం లేకపోయింది. సరబ్‌జీత్ ను పాక్ ప్రభుత్వం లాహోర్ లోని లఖ్‌పత్ జైల్లో పెట్టింది. అయితే భారత పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్‌జీత్ పై దాడి చేశారు.
వారు జరిపిన దాడిలో సరబ్‌జీత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇటుకలతో సరబ్‌జీత్ పై దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే సరబ్‌జీత్ పాకిస్తాన్ జైలులో 23 ఏళ్లు గడిపి.. 2013లో 49 ఏళ్ల వయస్సులో లాహోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read : బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది!