Sara Tendulkar - Shubman Gill Relations: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్(Sara Tendulkar) మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఈ ప్రచారం ఆగిపోయినా.. తాజాగా వైరల్ అవుతున్న ట్వీట్‌తో వీరి ప్రేమకథ మళ్లీ మాట్ డిస్కషన్‌గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు ఏడాది క్రితం నుంచే పుకార్లు షికారు చేస్తున్నాయి. సారా, శుభ్‌మన్ గిల్ గతంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులే అందుకు ఆధారాలుగా నిలిచాయి. అయితే, వీరి రీలేషన్‌పై అటు సారా నుంచి గానీ.. ఇటు శుభ్‌మన్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక టెండూల్కర్ సైతం యువ క్రికెట్ శుభ్‌మన్ గిల్‌ను లైక్ చేస్తారు. శుభ్‌మన్ గిల్ 24వ పుట్టిన రోజున సచిన్ శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.
అయితే, శుభ్‌మన్ గిల్‌పై సారా టెండూల్కర్ చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. వాస్తవానికి శుభ్‌మన్ గిల్ ఇటీవల డెంగ్యూ భారిన పడ్డాడు. దాంతో అతను వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో.. సారాగా శుభ్‌మన్ గిల్ ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేసింది. ట్విట్టర్ వేదికగా ‘గెట్ వెల్ సూన్ శుభ్‌మన్’ అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో హార్ట్ సింబల్‌తో పాటు.. ఇండియన్ ఫ్లాగ్‌ను కూడా యాడ్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రియాక్షన్స్ వస్తున్నాయి. ‘ఈ పోస్ట్‌ను బట్టే అర్థం చేసుకోవచ్చు. శుభ్‌మన్ గిల్‌ను సారా ప్రేమిస్తోంది.’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సారా ట్వీట్ వైరల్ అయిన నేపథ్యంలో.. అభిమానులు తమ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. వీరిద్దరి ప్రేమ కథ గురించి పెద్ద డిస్కషన్ మొదలుపెట్టారు. కొందరు ఈ ట్వీట్‌ను ఫేక్ అని చెబుతున్నారు. ఇది సారా టెండూల్కర్ అఫిషియల్ అకౌంట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ రియలో, ఫేకో గానీ.. సోషల్ మీడియాను, క్రికెట్ అభిమానులను షేక్ చేస్తోంది.
Also Read:
ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!
Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!