/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-15-1-jpg.webp)
Santanu Hazarika Reacts On Break Up With Shruti Haasan :శృతి హాసన్(Shruti Hassan) ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది.
ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్(Doodle Artist) శాంతను హజారికా(Shantanu Hazarika) తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా(Social Media) లో ఈ ఇద్దరూ ఎన్నోసార్లు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే తాజాగా ఈ ఇద్దరికి బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sruthi-hasan-1024x683.webp)
అందుకు ప్రధాన కారణం శృతి హాసన్ తన ప్రియుడ్ని అన్ ఫాలో చేయడమే. అటు శాంతను సైతం శృతి హాసన్ ని ఫాలో అవ్వకపోవడం గమనార్హం. వీళ్ళ బ్రేకప్ కి వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఇద్దరు బ్రేకప్(Breakup) చెప్పుకున్నారట. అంతేకాదు ఈ ఇద్దరూ తమ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/shruti-haasan-santanu-hazar-1-jpg.webp)
Also Read : ముంబై లో ఎన్టీఆర్.. భార్యతో కలిసి డిన్నర్ పార్టీ.. సందడి చేసిన హృతిక్, రణ్ బీర్, ఆలియా!
బ్రేకప్ పై నోరు విప్పిన శాంతను
ఇప్పటి వరకు శృతి హాసన్ తన బ్రేకప్ పై రియాక్ట్ లేనప్పటికీ.. తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా బ్రేకప్ పై నోరు విప్పాడు. శృతి హాసన్ తో బ్రేకప్ గురించి శాంతనును ఇటీవల ప్రశ్నించగా అతను బ్రేకప్ అయినట్లు చెప్పాడు. కానీ అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/94926e454069549fc3e2f5344177f9fe-jpg.webp)
అతన్ని శృతి హాసన్ తో బ్రేకప్ కి గల కారణాలు అడిగితే .. " నన్ను క్షమించండి.. నేను దానిపై మాట్లాడటానికి ఇష్టపడను" అని చెప్పాడు. కారణాలేమైనా శాంతను శ్రుతిహాసన్ తో బ్రేకప్ అయినట్లు స్వయంగా కన్ఫర్మ్ చేయడంతో మరోసారి వీళ్ళ బ్రేకప్ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
Follow Us