Sankranti Holidays : ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు

ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.

Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం
New Update

Sankranti Holidays : సంక్రాంతి(Sankranti) పండుగ నేపథ్యంలో తెలంగాణ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్(Telangana Government). జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ను ఉండనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు మూతపడనున్నాయి. తిరిగి 18వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి.

క్లాసులు తీసుకుంటే అంతే..

జనవరి 13న రెండవ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో స్కూల్ విద్యార్థులకు వరుసగా ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ ఇంకా పూర్తి కాలేదని.. పండుగ సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించింది.

ALSO READ: తెలంగాణ భవన్‌లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ!

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు సంక్రాంతి(Sankranti Holidays) సెలవులను ప్రకటించిన ఇంటర్ బోర్డు(Inter Board). జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కాలేజీలు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ప్రత్యేక బస్సులు..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరాలు, పట్టణాలకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రజలకు TSRTC శుభవార్త చెప్పింది. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

#telangana-latest-news #telangana-sankranti-holidays #sankranti-holidays #schools-closed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe