/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T153547.465.jpg)
Heeramandi Season 2: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ లేటెస్ట్ సూపర్ హిట్ వెబ్ సీరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సీరీస్ మంచి విజయాన్ని అందుకుంది. స్వాతంత్య్రానికి ముందు.. అంటే 1940 కాలంలో లాహోర్‌లోని హీరామండిలో(వేశ్యావాటిక) జీవనం కొనసాగించిన వేశ్యలు, వారు ఎదుర్కున్న పలు సంఘటనల నేపథ్యంలో సాగిన 'హీరమండి' విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికీ ఈ సిరీస్ లోని సన్నివేశాలు, సంగీతం, డైలాగ్‌లు నెట్టింట వైరలవుతూనే ఉన్నాయి.
హీరామండి సీజన్ 2
అయితే తాజాగా హీరామండి సీజన్ 2 అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. సెకండ్ సీజన్ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వీడియోను రిలీజ్ చేసింది నెట్లిక్స్ ఇండియా. ఈ వీడియోలో 100 మంది డ్యాన్సర్లు 'హిరామండి' పాటపై ప్రదర్శన చేస్తుండగా.. గ్రాండ్ గా సీజన్ 2ను ప్రకటించారు. ఈ ప్రదర్శన ముంబైలోని కార్టర్ రోడ్‌లో జరిగింది. ఇక సీజన్ 2లో వేశ్యలందరూ హీరామండి (లాహోర్) నుంచి ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
Mehfil phir se jamegi, Heeramandi: Season 2 jo aa raha hai 🌹✨🎉#HeeramandiOnNetflix #Heeramandi #HeeramandiTheDiamondBazaar pic.twitter.com/ns02aVh6ly
— Netflix India (@NetflixIndia) June 3, 2024
ఈ సీరీస్ లో వేశ్యలుగా కనిపించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే నవాబుల పాత్రలలో ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ వంటి నటీనటులు తక్కువ సమయం కనిపించినప్పటికీ పవర్ ఫుల్ మార్క్ క్రియేట్ చేశారు.
Also Read: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా.. 'Heeramandi' రిలీజ్ డేట్ రివీల్ (rtvlive.com)